గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. అయితే ఈ విష‌యంలో సంతోషంగా ఉన్న సమ‌యంలో ఇద్ద‌రు రామ్ చ‌ర‌ణ్ అభిమానులు రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించిన‌ట్లు తెలిసింది. తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో రామ్ చరణ్ అభిమానులు చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ.5ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతి అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.